Anasuya Bharadwaj: ట్రోలింగ్ తట్టుకోలేక ఆవేదన
సోషల్‌మీడియాలో తనపై చేస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేక యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) కంటతడిపెట్టుకున్నారు. ట్విటర్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసారు.
“” హలో.. అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఈ పోస్ట్ ఎందుకు పెడుతున్నానా అని మీరంతా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి ఇతరులతో కనెక్షన్స్ పెంచుకోవడానికే. మంచి సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి, ఇతరుల లైఫ్‌స్టైల్, కల్చర్ గురించి తెలుసుకోవడానికి సుఖసంతోషాలను షేర్ చేసుకోవడానికే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అదంతా నిజం కాదనిపిస్తోంది. ఏదేమమైనప్పటికీ ఈ పోస్ట్ ఎందుకు పెడుతున్నానంటే నా సంతోషాలు, నా ఫొటోలు, నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ నా జీవితంలో భాగమే. మీరు కూడా అంతే. కాబట్టి నేను మీతోనే అన్నీ చెప్పుకుంటాను. నేను స్ట్రాంగ్‌గా లేనప్పుడు ఏడ్చేస్తాను. నేనొక పబ్లిక్ ఫిగర్‌ని (anasuya bharadwaj)
కాబట్టి కాస్త యాటిట్యూడ్ చూపించడం, ఏమీ పట్టించుకోనట్లు ఉండటం ఇవన్నీ బలవంతంగా నేను ప్రదర్శించాల్సి వస్తోంది. నేను ఇలా ఉన్నానంటే దానర్థం నేను స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కాదు. నా అసలైన బలం ఇదే. ఇలా ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఇలా కన్నీరుపెట్టుకోవడం. ఇలా బాధపోయేలా ఏడ్చేసి రెండు రోజుల తర్వాత ఏమీ కానట్లు ముఖంపై చిరునవ్వుతో ప్రపంచాన్ని ఎదుర్కోవడం. ఒక్కోసారి బాగోలేకపోవడం కూడా బెటరే. ఏదేమైనా రెస్ట్ తీసుకోవడం.. మళ్లీ మనల్ని రీబూట్ చేసుకోవడం…ఎప్పటికీ క్విట్ చేయకపోవడం చాలా ముఖ్యం. నేను ప్రతి ఒక్కరినీ కోరుకునేది ఒక్కటే. మీరు జీవితంలో ఎలాంటి బాధలను ఎదుర్కొన్నా కూడా ఇతరుల పట్ల కనికరం చూపించండి. వాళ్లు ఏం అనుభవిస్తారో మనకు తెలీదు. ఏదో ఒక రోజు మంచి రూపంలో అది మన దగ్గరకు వస్తుంది. నాకు అదే జరిగింది. నేను బాగానే ఉన్నాను. నేను ఏడుస్తున్న వీడియో ఐదు రోజుల క్రితం రికార్డ్ చేసినది. ఒక మెమొరీలా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. “” అని తెలిపారు. (anasuya bharadwaj)