Anasuya Bharadwaj: అవును నాకు అటెన్షన్ కావాలి
ట్రోలర్స్‌కి మీమర్స్‌కి కంటెంట్ ఇచ్చేవారిలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) ఒకరని చెప్పొచ్చు. ఓపక్క ఏడుస్తూ వీడియోలను పోస్ట్ చేయడం.. సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువగా ఉందని చెప్తూ పోస్ట్ పెట్టడం వంటివి చేస్తూనే.. కాసేపయ్యాక నేను ఏడ్చింది ట్రోలింగ్ వల్ల కాదు తప్పుగా అర్థంచేసుకున్నారు అని మరో పోస్ట్ పెట్టడం. ట్విటర్‌లో ఎన్ని పోస్ట్‌లు పెడితే ఎంత రీచ్ వస్తే అన్ని డబ్బులు వస్తాయని తెలిసి ఇలా చేస్తారో లేదా ఏదో సరదాగా చేస్తారో తెలీదు కానీ ఇది నిజంగా పైత్యం అనే అనుకోవాలి.
తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకున్నారట దాని గురించని అంతగా ఏడ్చిన వీడియోని పోస్ట్ చేసారట. అసలు ఆ నిర్ణయం ఏంటో? అది మనతో ఎందుకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆమెకే తెలియాలి. ఏమన్నా అంటే నా ఫ్యాన్స్‌తోనే కదా కష్టసుఖాలను షేర్ చేసుకునేది అని ఒక డైలాగ్ కొడతారు. మొత్తానికి తను ట్విటర్‌ను అటెన్షన్ కోసమే వాడుతున్నానని, ఈ విషయంలో తాను నిజం ఒప్పుకుంటున్నానని అన్నారు. చాలా మంది ఈ విషయంలో ముసుగులో గుద్దులాటలు ఆడుతుంటారని ఆరోపించారు. (anasuya bharadwaj)