Anasuya Bharadwaj: అరేయ్ చిట్టిబాబూ…!

Anasuya Bharadwaj: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ యాంకర్ అనసూయ కెరీర్‌లో కూడా ‘రంగస్థలం’ సినిమా ఎంతో ముఖ్యమైనది. చిట్టిబాబుగా రామ్ చరణ్, రంగమ్మ అత్తగా అనసూయ ఆడియన్స్ గుండెలో నిలిచిపోయారు. మూవీలో ఈ రెండు పాత్రలను సుకుమార్ డిజైన్ చేసిన విధానం ప్రతి ఒక్కర్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి అనసూయ ఎక్కడైన కనిపిస్తే.. రంగమ్మ అత్త అని పిలిచేవారు ఎక్కువ ఉంటారు.

కాగా అనసూయ ప్రస్తుతం ‘రజాకార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న అనసూయ.. తాజా ఇంటర్వ్యూలో రంగమ్మ అత్త స్టైల్ లో రామ్ చరణ్ కి విషెస్ తెలియజేసారు. ‘క్లీంకార’ పుట్టినందుకు రామ్ చరణ్ కి రంగమ్మ అత్త స్టైల్ లో విషెస్ చెప్పాలంటే.. ఎలా చెబుతారని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

అనసూయ బదులిస్తూ.. “అరేయ్ చిట్టిబాబు పాప పుట్టింది అంటగా. చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే” అంటూ చెప్పుకొచ్చారు. అనసూయ మాటలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరోసారి చిట్టిబాబు, రంగమ్మ అత్త గుర్తుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చెంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్నారు. మరి గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ, రామ్ చరణ్ తో కలిసి కనిపిస్తుందేమో చూడాలి. ఈ ఏడాది సమ్మర్ లో ఈ మూవీ స్టార్ట్ కానుందని సమాచారం. (Anasuya Bharadwaj)

మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ తో పాటు సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటిస్తూ నిర్మాణ సంస్థలు వరుస ట్వీట్లు చేశాయి. ‘కొన్నిసార్లు, తిరుగుబాటు అవసరం అవుతుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి ఆ తిరుగుబాటు ఎందుకు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. కబడ్డీ ఆధారంగా కథ సాగుతుందని సమాచారం.

తమ సినిమాను నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సందర్భంగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘దీని కోసం చాలా ఎగ్జయిట్ అయ్యాను. బుచ్చిబాబు, మిగిలిన బృందంతో పనిచేయడానికి ఆసక్తికగా ఎదురుచూస్తున్నాను’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అలాగే బుచ్చిబాబు స్పందిస్తూ.. ‘‘కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది. నా తరవాత సినిమాను రామ్ చరణ్ సార్‌తో చేస్తున్నట్టు చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వెలకట్టలేని ఈ అవకాశానికి ధన్యవాదాలు చరణ్ సార్. మీకెప్పటికీ రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నారు.

RRR సినిమా తరవాత రామ్ చరణ్‌పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ జతకట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. అక్కడ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే సమాంతంగా బుచ్చిబాబు సినిమాను మొదలుపెడతారని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో RC16 పట్టాలెక్కుతుందని అంటున్నారు.