Anasuya Bharadwaj: ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను ముందే చెప్పాను
Anasuya Bharadwaj: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఏదో ఒక అంశంతో ట్రోల్‌కు గురవుతూ ఉంటారు. గతంలో ఆమెకు విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత నేను ఇక దీని గురించి మాట్లాడదలచుకోలేదు అని చెప్పి సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు కార్తిక్ అనే నెటిజన్ ఒకరు విజయ్ దేవరకొండను తిడుతూ.. అనసూయను ఇన్వాల్వ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. దాంతో అనసూయ మళ్లీ వివాదాస్పదంగా మారారు.
“” విజయ్ దేవరకొండ ఇష్టమొచ్చినట్లు వాగడం.. మళ్లీ పీఆర్ మాఫియాతో తెలంగాణ హీరోపై ద్వేషం అని రుద్దడం. నా కారులో పెట్రోల్ లేదు.. బైక్‌కి సైలెన్సర్ లేదు అని సింపతీ క్రియేట్ చేయడం. చివరికి అనసూయ ఆంటీని దింపడం “” అని కార్తిక్ అనే నెటిజన్ ట్వీట్ చేసాడు.
దీనిని చూసిన అనసూయ వెంటనే రిప్లై ఇచ్చారు. “” ఎందుకు కార్తిక్ గారు అనవసరంగా నా పేరు లాగుతారు. ఎవరు ఎలాంటి మాఫియాకు పాల్పడుతున్నారో నేను గతంలో ముందే చెప్పాను. అనవసరంగా నేనే వాళ్లకు హైప్ ఇస్తున్నాను అని మావాళ్లు చెప్పడంతో సైలెంట్ అయిపోయాను. నేనూ తెలంగాణ బిడ్డనే. నాకు సింపతీ అవసరం లేదు. నాకు నా మీద ఆ దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు నేను చేసిన ట్వీట్‌ని తమ స్వార్ధానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను. నాకు వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు. అన్నట్టు.. నాకు తెలిసి నేను మీకు చుట్టాన్ని కాదు. కాబట్టి ఆంటీ అనకండి. లేదంటే ఓసారి మీ ఇంట్లో వారిని అడగండి మీకు నేను ఏమన్నా దూరపు చుట్టాన్ని అవుతానేమో. ఎందుకంటే చుట్టాలైతేనే ఇలా ఆంటీ అనే పలకరింపులు ఉంటాయని నాకు నా పెద్దవాళ్లు నేర్పించారు “” అని ట్వీట్ చేసారు అనసూయ