Anand Devarakonda: లైగర్ రిలీజైన రోజే అన్నకు అర్థమైపోయింది
Hyderabad: లైగర్ (liger) సినిమా విజయ్ దేవరకొండ (vijay devarakonda) కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్ (puri jagannath) టేకింగ్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ వర్కవుట్ అవ్వకపోవడం వల్లో, ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడం వల్లో సినిమా పోయింది. అయితే లైగర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే రిజల్ట్ విజయ్‌కి అర్థమైపోయిందని అంటున్నారు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ (anand devarakonda). బేబీ (baby) సినిమాతో ఆనంద్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా లైగర్ సినిమా విషయంలో విజయ్ ఎలా ఫీలయ్యాడో చెప్పాడు. రిలీజైన రోజే తెలిసిపోవడంతో సినిమాను ఇంక ప్రమోట్ చేసి జనాలపై రుద్దాలనుకోలేదని తెలిపాడు. ఆగస్ట్ 24న సినిమా రిలీజ్ అయితే.. ఆగస్ట్ 25 నుంచే ఇక ఆ సినిమా గురించి ఆలోచించడం మానేసి ఖుషి (khushi) సినిమాపై ఫోకస్ చేసాడని తెలిపాడు. మానసికంగానూ బాధపడుతూ కూర్చోలేదని అన్నాడు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన సినిమాల కోసం పెట్టే ఎఫర్ట్స్‌పై ఎవరూ వేలెత్తి చూపలేరని ఆనంద్ (anand devarakonda) చెప్పాడు.