Amitabh Bachchan: బిగ్‌బికి ఏంజియోప్లాస్టీ స‌ర్జరీ..!

Amitabh Bachchan: న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ హాస్పిట‌ల్‌లో చేరారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న అడ్మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. కాలికి ఏంజియో ప్లాస్టీ జ‌రిగింద‌ని.. కాలి భాగంలో ఓ న‌రంలోని ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ఈ చికిత్స జ‌రిగింద‌ని తెలుస్తోంది. కొంద‌రేమో ఆయ‌న గుండెకు స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి మొదటి వారంలో అమితాబ్ చేతికి స‌ర్జ‌రీ జ‌రిగింది.