Amala Paul: న్యూడ్‌గా నటించేందుకు రెడీ!
Hyderabad: మలయాళ భామ అమలాపాల్(Amala Paul) దక్షిణాదితో పాటు బాలీవుడ్(Bollywood)లోనూ పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నాయక్(Nayak), ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ భామ ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో ఒక మూవీ చేస్తుంది. శాండిల్‌వుడ్(Sandalwood)పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) హీరోగా నటిస్తున్న ‘ఆడుజీవితం’ (Aadujeevitham) సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లేస్సి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ది గోట్ లైఫ్ పేరుతో ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. దాదాపు 10 ఏళ్ళ నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
కాగా ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ మేక్ ఓవర్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇక ఇదే ట్రైలర్ లో పృథ్వీరాజ్ తో అమలాపాల్ లిప్ లాక్ సీన్ చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల హాట్ ఫోటోషూట్ లతో రచ్చ చేస్తున్న అమలాపాల్ ఇప్పుడు ఘాటైన లిప్ లాక్ సీన్ లో కనిపించడంతో.. ఈ అమ్మడి బోల్డ్ సన్నివేశాల జోరు ఇప్పట్లో తగ్గేలా లేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిప్ లాక్ సన్నివేశం పై అమలాపాల్ రెస్పాండ్ అయ్యింది.
ఈ సినిమాకి తాను సైన్ చేసినప్పుడే దర్శకుడు లిప్ లాక్ సన్నివేశం గురించి చెప్పినట్లు వెల్లడించిన అమలాపాల్.. సన్నివేశం పండాలంటే అది తప్పనిసరి అని ఓకే అన్నట్లు చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్దమే అని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన అమలాపాల్.. న్యూడ్ గా నటించేందుకే సిద్దమైన తనకి లిప్ లాక్ పెద్ద ఇబ్బంది అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో ఈ భామ ‘ఆమె’ సినిమాలో న్యూడ్ గా కనిపించిన విషయం తెలిసిందే.