Amala Paul: బెస్ట్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం..!
ప్రముఖ తమిళ నటి అమలా పాల్ (amala paul) నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ని (jagat desai) అమల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్‌ని (al vijay) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అమల. ఆ తర్వాత ఏడాదికే అమల సినిమాలు మానేయనని చెప్పడం.. అది విజయ్ ఇంట్లోవారికి నచ్చకపోవడంతో ఇద్దరూ పరస్పరం విడాకులు తీసుకున్నారు.