బర్త్​డే స్పెషల్​.. కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్​!

Hyderabad: ‘గౌరవం’ సినిమాతో హీరోగా టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చారు అల్లు శిరీష్(Allu Sirish)​. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Sirish)​ చిన్న కొడుకైన శిరీష్​ అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరైన హిట్​ మాత్రం కొట్టలేకపోయారు. శిరీష్​ అన్న ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్(Allu arjun)​ పుష్ప సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు. కానీ శిరీష్​కి మాత్రం ఒక్క సినిమా కూడా అనుకున్న ఫలితం ఇవ్వట్లేదు.

శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షశివో వంటి సినిమాలు కాస్త ఫర్వాలేదనిపించినా కమర్షియల్​గా మాత్రం సక్సెస్​ సాధించలేకపోయాయి. కాగా, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శిరీష్​ తన తదుపరి సినిమా అప్​డేట్​ ఇచ్చారు. ‘బడ్డీ’(Buddy) టైటిల్​తో సోషల్​ మీడియా వేదికగా పోస్టర్​ రిలీజ్​ చేశారు. పోస్టర్​ని బట్టి ఈ సినిమా ఓ సన్పెన్స్​ థ్రిల్లర్​ అని అర్థమవుతోంది. కాగా, ఈ సందర్భంగా సోషల్​ మీడియాలో శిరీష్​ కి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఆల్​ ది బెస్ట్​ చెబుతున్నారు అభిమానులు.