Allu Arjun: అర్హ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా!
Hyderabad : సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా నేడు(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా(Pan India) స్థాయిలో రిలీజ్ అయింది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్(Dev Mohan) దుశ్యంతుడి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో శకుంతల తనయుడు భరతుడి(Bharathudu) పాత్రలో అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అల్లు అర్హ(Allu Arha) నటించిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. అర్హ క్యూట్ క్యూట్ మాటలతో కూడిన వీడియోలను బన్నీ కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇక అర్హ చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అభిమానులు కూడా ఎదురుచూశారు.
కాగా, తాజాగా అల్లు అర్జున్ శాకుంతలం టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. ‘శాకుంతలం టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన గుణశేఖర్, నీలిమ గుణ, దిల్ రాజు(Dil Raju)కు నా బెస్ట్ విషెస్. స్వీటెస్ట్ లేడీ సమంత, నా మల్లు బ్రదర్ దేవ్ మోహన్ కు కూడా శుభాకాంక్షలు. మీ అందరికి అల్లు అర్హ చేసిన చిన్న గెస్ట్ పాత్ర నచ్చుతుంది అనుకుంటున్నాను. అర్హను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు, తనని జాగ్రత్తగా చూసుకున్నందుకు గుణశేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు బన్నీ. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప2(Pushpa2) మేకింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.