Allu Arjun: అత్యధిక పన్ను కట్టిన ఏకైక టాలీవుడ్ నటుడు
Allu Arjun: టాలీవుడ్‌లో కోట్లల్లో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నవారు బాక్సాఫీస్ బద్దలు కొట్టేవారు చాలా మందే ఉన్నారు. కానీ పన్ను కట్టడంలో మాత్రం అత్యధికంగా కడుతున్నది స్టైలిష్ట స్టార్ అల్లు అర్జునే అట. ఈ ఏడాది బన్నీ కట్టిన పన్ను రూ.14 కోట్లు. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్, మహేష్ బాబు ఉన్నారు. కానీ దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న ఏకైక నటుడు దళపతి విజయ్. ఇతను ఈ ఏడాది రూ.80 కోట్లు పన్నుగా చెల్లించాడు. అంతేకాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుడు కూడా ఆయనే. నిన్న రిలీజ్ అయిన GOAT సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా రూ.200 కోట్లు.