Allu Arjun: ఈ అమ్మాయి హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేస్తోంది

Allu Arjun: యానిమ‌ల్ (animal) సినిమాలో రణ్‌బీర్ క‌పూర్ (ranbir kapoor), ర‌ష్మిక మంద‌న‌కు (rashmika mandanna) రాని పాపులారిటీ ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించిన తృప్తి డిమ్రి (tripti dimri) అనే అమ్మాయికి వ‌స్తోంది. ఇందులో తృప్తి ర‌ణ్‌బీర్ రెండో ల‌వ‌ర్‌గా శృంగార‌భ‌రిత‌మైన సన్నివేశాల్లో న‌టించి త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది.

ఈ అమ్మాయి అందానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయారు. యానిమ‌ల్ సినిమా త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని ట్వీట్ చేస్తూ ఎంద‌రో హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంద‌ని ఇంకా ఎన్నో కొల్ల‌గొట్టాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇక బ‌న్నీ నుంచి కాంప్లిమెంట్ వ‌చ్చిందంటే ఆ అమ్మాయి కెరీర్ దూసుకెళ్ల‌బోతోంద‌ని అర్థం.