Allu Arjun: మా నాన్నకు ముందు చూపు ఎక్కువే..!
Hyderabad: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల విషయంలో తన తండ్రి ముందే ఊహించేసారని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun). శ్రీరస్తు శుభమస్తు సినిమా రిలీజ్ సమయంలో అందులో హీరోయిన్‌గా నటించిన లావణ్య త్రిపాఠి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనర్గళంగా తెలుగులో మాట్లాడటం చూసి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ షాకయ్యారు. లావణ్య మాట్లాడుతుంటే మైక్ పట్టుకుని.. “ఎక్కడినుంచో వచ్చి ఇంత బాగా తెలుగులో మాట్లాడుతోంది. ఇక్కడే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేసుకుంటే మంచిది” అని అన్నారు. అప్పుడు ఆయన ఏదో సరదాగా అన్న మాటను లావణ్య సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఇప్పుడు మెగా కుటుంబానికే కోడలు అయిపోతున్నారు. అప్పటి వీడియోని అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. మా నాన్నకు దూరదృష్టి ఎక్కువే అని ఫన్నీ కామెంట్ చేసారు.