Allu Arjun: ఆ హీరోతో కలిసి న‌టించ‌న‌న్నారా?

Hyderabad:కోలీవుడ్​ టాప్ డైరెక్టర్లలో ఒకరు వెట్రిమారన్(Vetrimaran)​. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ప్రతీ హీరో ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయనతో సినిమా చెయ్యడానికి టాలీవుడ్​ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నో చెప్పారట. తాజాగా పలు విషయాలను పంచుకున్న వెట్రి బన్నీతో మిస్సయిన సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోలీవుడ్​ స్టార్​ ధనుష్(Dhanush)​ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించింది. అయితే ఆ సినిమాలో ఓ పవర్​ఫుల్​ పాత్రలో అయినా నటించమని కోరారట వెట్రి. కానీ బన్ని అతిథి పాత్ర చెయ్యనని తెగేసి చెప్పారట. దీంతో బన్ని మంచి ఛాన్స్​ మిస్​ చేసుకున్నాడని అనుకుంటున్నారు అభిమానులు.

ఇండియాలోని ది బెస్ట్ డైరెక్టర్స్ లలో వెట్రి ఒకరు. ఆయన ఇప్పటివరకు తీసింది కేవలం ఐదు సినిమాలే అయినా..ప్రతి సినిమా ఓ అద్భుతం, సంచలనంగా మారింది. అంతే కాదు ఆయన సినిమా తీస్తే అవార్డులు వెతుక్కుని మరీ వస్తాయనే టాక్​ కూడా ఉంది. ఇటీవలే ‘విడుతలై పార్ట్ 1’ తీసి మంచి హిట్ కొట్టారు.విడుతలై తెలుగు వెర్షన్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన వెట్రీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అడాకులం’ సినిమా తర్వాత ‘వడ చెన్నై’ స్క్రిప్ట్‌తో అల్లు అర్జున్‌ను కలిశానని, కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఓకే కాలేదని అన్నారు. తర్వాత ‘వడ చెన్నై’ సినిమా ధనుష్‌కు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అల్లుఅర్జున్‌ ‘గోల్డెన్‌ ఛాన్స్’ మిస్ చేసుకున్నాడని నెటీజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

ఇక బన్ని ప్రస్తుతం పుష్ప2(Pushpa2) సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్(Sukumar)​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్​ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్​ నటించనున్నారు.