“నా పేరు అల్లు అర్హా రెడ్డి”
Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రాజకీయ నాయకుడైన చంద్రశేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. పెద్దలు కుదర్చిన వివాహం అని బన్నీ చాలా సందర్భాల్లో చెప్పారు. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా మన భారతీయ సంప్రదాయం ప్రకారం పిల్లలకు తండ్రి ఇంటి పేరు, కుల గోత్రాలు వర్తిస్తాయి.
అయితే.. అర్హ తన పేరును నా పేరు అల్లు అర్హా రెడ్డి అని చెప్పడం వైరల్‌గా మారింది. అర్హ తాతగారు చంద్రశేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అర్హ ఆయనతో పాటు ఉంది. అప్పుడు అర్హను తన పేరేంటి అని అడిగితే.. అల్లు అర్హ రెడ్డి అని చెప్పిందట. అర్హ ఇలా చెప్పడం ఒక వర్గం వారికి నచ్చలేదని టాక్.