Allu Aravind: నేను వాళ్ల గురించి మాట్లాడితే ర‌చ్చ‌వుతుంది

Allu Aravind about bollywood tollywood

Allu Aravind: ఒక‌ప్పుడు బాలీవుడ్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. ఇప్పుడు టాలీవుడ్‌కి అంత‌ర్జాతీయ స్థాయిలో ఉంది. దాంతో బాలీవుడ్ ప‌రిస్థితి ఎలా మారిపోయిందంటే.. సొంత హిందీ రాష్ట్రాల్లోనే వారి సినిమాల‌ను చూసేవారు క‌రువైపోయారు. దీనిపై ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స్పందించారు.

“” నేను బాలీవుడ్ గురించి మాట్లాడితే ర‌చ్చైపోతుంది. అయినా స‌రే నా అభిప్రాయాన్ని ముక్కు సూటిగా వెల్ల‌డిస్తాను. బాలీవుడ్ వాళ్లు ముంబైలోని బాంద్రా, జుహు ప్రాంతాల‌కే పరిమితం అయిపోతున్నారు. దాంతో అక్క‌డి ప్ర‌జ‌లే వారి సినిమాలు చూస్తున్నారు. కానీ సినిమా అంటే కేవ‌లం బాంద్రా, జుహు మాత్ర‌మే కాదు క‌దా. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమాల‌ను డ‌బ్బింగ్ చేస్తే బిహార్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి కోట్ల‌ల్లో వ్యూస్ ఉంటాయి. కానీ బాలీవుడ్ సినిమాల‌ను అక్క‌డి వాళ్లు ఎవ్వరూ చూడ‌రు

ఇదే విష‌యం గురించి నేను బాలీవుడ్ పెద్ద‌ల‌తో మాట్లాడాను. వారి పేర్లు చెప్ప‌లేను. నేను చెప్పిన స‌ల‌హాలు విని ఇప్పుడు భార‌త‌దేశం మొత్తం చూసేలా సినిమాలు తీసేందుకు వారు సిద్ధం అవుతున్నారు. త్వ‌ర‌లో ద‌క్షిణాది సినిమాల పాపులారిటీ మాయ‌మైపోతుంది. ఎందుకంటే బాలీవుడ్ ద‌ర్శ‌కులు కూడా ఇప్పుడు యావ‌త్ భార‌త‌దేశం వీక్షించే సినిమాలు చేయ‌బోతున్నారు. రేపు భార‌తీయ సినిమా అని మాత్ర‌మే ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకుంటారు “” అన్నారు.