Allari Naresh: ఉగ్రంలో మూడు వేరియేషన్స్​లో కనిపిస్తా!

Hyderabad: అల్లరి నరేశ్(Allari Naresh) నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’(Ugram). ఈ సినిమా మే 5న రిలీజ్ అవుతోంది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్​ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అల్లరి నరేష్​ నటవిశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంటున్న నరేష్​ అనేక విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి అందులో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

‘సక్సెస్ పై చాలా నమ్మకంగా వున్నాను. ‘ఉగ్రం’ సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందం గారు, ‘విడుదల’లో సూరిలను అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ‘ఉగ్రం’ విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్ ల కంటే మైనస్ లు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నా కంటే ఎత్తు తక్కువ వున్న వాళ్ళతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని.. వీటన్నిటిని అధిగమించాలని ముందే వివరంగా చెప్పాడు.

ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ లో ఉండే పాత్రలో నేను కనిపిస్తాను. ఐదేళ్ళ టైం లిమిట్ లో కథ సాగుతుంది. ఎస్సై శిక్షణ వుండగా ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత పెళ్లి, ఒక కూతురు పుడుతుంది. పెళ్లి తర్వాత బరువు పెరుగుతారని నా బరువు కూడా కాస్త పెంచాడు విజయ్. మొదట సిఐ, తర్వాత ఎస్ఐ, చివర్లో షార్ట్ హెయిర్ వున్న పాత్ర చేయడం జరిగింది’ అని వివరించారు.