Manjummel Boys: 10 రోజుల్లో 100 కోట్లు రాబ‌ట్టింది.. ఏముంది సినిమాలో?

Manjummel Boys: బాక్సాఫీస్ వద్ద ఇప్పుడంతా మలయాళీ చిత్రాల జోరు నడుస్తోంది. స్టార్ హీరోస్ కాదు.. టాప్ డైరెక్టర్స్ లేరు.. కానీ అత్యధిక వసూళ్లు రాబడుతూ సెన్సెషన్ సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు వచ్చి ఊహించని రేంజ్‏లో హిట్టవుతున్నాయి. దీంతో అదే చిత్రాలను మిగతా భాషల్లోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పటికే ట్రూ లవర్, హాస్టల్ బాయ్స్, జో వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. తక్కువ బడ్జెట్ అయిన మలయాళీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ నడుస్తుంది. కేవలం 10 కోట్లతో నిర్మిస్తే వంద కోట్ల క్లబ్‏లో చేరిన సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏంటీ అనుకుంటున్నారా ?.. అదే ‘మంజుమేల్ బాయ్స్’.

కేవలం పది కోట్లతో నిర్మిస్తే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలోని కామెడీ మరియు థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంజుమేల్ బాయ్స్ అనే యువకుల బృందం తమిళనాడులోని కొడైకెనాల్‌లోని ‘గుణ గుహలు’కి విహారయాత్రకు వెళ్లే కథతో ఈ చిత్రం ఉంటుంది. కమల్ హాసన్ అభిమానులు అయిన ఆ యువకులు ‘గుణ’ షూటింగ్ జరిగిన ‘గుణ కేవ్స్’ వద్దకు వెళ్తారు. అదే సమయంలో తమ టీంలోని ఓ యువకుడు డెవిల్స్ కిచెన్‌లో పడిపోతాడు. దీంతో మిగతా సభ్యులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనేది మంజుమేల్ బాయ్స్ కథ. ఇందులో సోబిన్, శ్రీనాథ్ బస్సీ, బాలు, లాల్జీ తదితరులు నటించారు.

తమిళంలోనూ ఈ చిత్రాన్ని డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసి ప్రశంసలు కురిపించారు కమల్. అటు తమిళంలోనూ రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ చిత్రం. తమిళనాడులో రజనీకాంత్ ‘లాల్ సలామ్’ కలెక్షన్ల కంటే ‘మంజుమేల్ బాయ్స్’ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. (Manjummel Boys)

ఇకపోతే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ విడుదల తేదీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ మూవీ ని “ది బాయ్స్” అనే పేరు తో తెలుగు లో మార్చి 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది … టాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ ఏ రేంజ్ లో అలరిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ది బాయ్స్ అనే టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందింది. ఈ మూవీ అంతా మంచి సస్పెన్స్ గా ముందుకు సాగినప్పటికీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఈ సినిమా స్వరూపాన్ని మార్చే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ 20 నిమిషాలతో ఈ సినిమా అదిరిపోయే స్థాయికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది.