Alia Bhatt: రాజమౌళి నాకు అదే చెప్పారు
Alia Bhatt: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన RRR సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఆలియా భట్. ఆమె ఈ సినిమాలో కనిపించేది కాసేపే అయినా మంచి ప్రభావం చూపించారు. అయితే సినిమాల విషయంలో రాజమౌళి తనకు ఒక సలహా ఇచ్చారని ఆలియా తెలిపారు. ఏ సినిమాను ఒప్పుకుని చేసిన కూడా ప్రేమతో చేయాలని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు నటీనటుల కళ్లల్లో సినిమా పట్ల ఉన్న ప్రేమను చూసి వారు కూడా ఇష్టపడతారని చెప్పారట.
“” నేను ఈజీగా బోర్ అయిపోతా. అందుకే ఒకే తరహా సినిమాలు చేయను. నా కెరీర్‌లో అదృష్టానిదే కీలక పాత్ర అని చెప్తాను. వైవిధ్యమైన సినిమాలు నా దగ్గరికి వాటంతట అవే వచ్చాయి. నేను చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి నా కృషి కంటే అదృష్టమే ఎక్కువగా ఉందని నమ్ముతాను “” అని తెలిపారు ఆలియా. ప్రస్తుతం ఆలియా జిగ్రా (Jigra) సినిమాలో నటిస్తున్నారు. వసన్ బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆలియానే నిర్మాతగా వ్యవహరించారు.