Ramayana: ఇంకో రామాయణమా..? ఎందుకు రా బుజ్జి.!
Mumbai: ఆల్రెడీ మన రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) రామయ్యగా నటించిన ఆదిపురుష్ (adipurush) రిలీజ్‌కి రెడీగా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ (om raut) చేసిన ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించారు. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో రామాయణం (ramayanam) తీయడానికి బాలీవుడ్ సిద్ధమైపోయింది. పైగా రాముడిగా రణ్‌బీర్ కపూర్ (ranbir kapoor), సీతగా ఆలియా భట్ (alia bhatt) నటిస్తారట. నితీష్ తివారీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఆదిపురుష్ (adipurush) షూటింగ్ సమయంలోనే రామాయణం తీయాలని నితీష్ అనుకున్నారట. రణ్‌బీర్ కపూర్ ఓకే అన్నాడు కానీ ఆలియా అప్పటికే RRR సినిమాలో నటిస్తుండడంతో డేట్స్ కుదరలేదు. కొన్ని కారణాల వల్ల సినిమాను ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆలియా డేట్స్ కూడా ఖాళీ ఉండడంతో మళ్లీ సినిమాను పట్టాలపై ఎక్కించాలనుకుంటున్నారు. అసలు ఎందుకని ఆదిపురుష్ ఉండగా ఇంకో రామాయణం తీయాలనుకుంటున్నారో వారికే తెలియాలి.
మరో ఫన్నీ విషయం ఏంటంటే.. ఆలియా భట్‌ని సీతగా ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అని ట్విటర్‌లో చర్చ జరుగుతోంది. దానికి ఆల్మోస్ట్ చాలా మంది నార్త్ ఇండియన్స్ రిప్లై ఇస్తూ RRR సినిమాలో ఆలియా సీత పాత్రలో బాగా సరిపోయింది అందుకే రామాయణంలో కూడా సీతగా నటిస్తే బాగుంటుంది అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది నార్త్ ఆడియన్స్ అల్లూరి సీతారామ రాజుని రాముడిలా, ఆయన భార్య సీతని సీతమ్మవారిలా చూస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే ఆల్రెడీ ఏకంగా 6 భాషల్లో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ ఉండగా ఇంకో రామాయణం తీయాలని బాలీవుడ్ ఎందుకు అనుకుంటోందో ఏంటో..!