Bharat: టైటిల్ భార‌త్ అని మార్చేసిన‌ స్టార్ హీరో

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా ఒకే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండియాను (india) భార‌త్ (bharat) అని మార్చాల‌న్న యోచ‌న‌లో కేంద్రం ఉంది. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరో త‌న సినిమా టైటిల్‌లో ఉన్న ఇండియా ప‌దాన్ని తీసేసి భార‌త్ అని మార్చేసారు. ఎవ‌రు అనుకుంటున్నారా? ఇంకెవ‌రండీ.. ఇలాంటి విష‌యాల్లో ముందుండే బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ (akshay kumar). ఇప్పుడు అక్ష‌య్ మిష‌న్ రాణిగంజ్ (mission raniganj) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ది గ్రేట్ ఇండియా రెస్క్యూ అని క్యాప్ష‌న్ పెట్టారు. ఇండియాను భార‌త్ అని మార్చాల‌న్న చ‌ర్చ మొద‌ల‌వ‌డంతో.. అక్ష‌య్ ది గ్రేట్ ఇండియా రెస్క్యూ అని తీసేసి ది గ్రేట్ భార‌త్ రెస్క్యూ అని మార్పించాడు. (bharat)