Akkineni: ముగ్గురివీ మూడు డిజాస్టర్లు!
Hyderabad: అక్కినేని(akkineni) కుటుంబానికి టైం కలిసి రానట్టుంది. ముగ్గురు హీరోలు నటించిన రీసెంట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. లాస్ట్ ఇయర్ అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) గోస్ట్(ghost) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు. బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ఈ సినిమాలో కనిపిస్తారు. నాగ్ తన స్వాగ్, ఛార్మ్తో ఆకట్టుకున్నప్పటికీ సినిమాలో మిగతావారి క్యారెక్టర్స్, స్ట్రాంగ్ స్టోరీ లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయింది.
ఇక అక్కినేని నాగచైతన్య(naga chaitanya).. తన తండ్రి కంటే ముందు థ్యాంక్యూ(thankyou) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విక్రమ్ కుమార్ సినిమాను డైరెక్ట్ చేసారు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. మోటివేషనల్ మూవీలా అనిపించడంతో ఆడియన్స్‌కు రుచించలేదు. దాంతో సినిమా ఫ్లాప్ అయిపోయింది.
ఇక అక్కినేని అఖిల్(akhil akkineni).. నిన్ననే ఏజెంట్(agent) సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(mammootty) కూడా సినిమాలో కీ రోల్లో నటించారు. అఖిల్ సినిమా కోసం పడిన కష్టం స్క్రీన్‌పై కనిపించినప్పటికీ సురేందర్ రెడ్డి రాసుకున్న కథలో బలం లేదు. దాంతో ఫస్ట్ డేనే రెస్పాన్స్ నెగిటివ్‌గా వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అఖిల్ ఈ సినిమాకు ఓకే చేసారు. సినిమాకు తగ్గట్టు బాడీ, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు. అయినప్పటికీ.. హిట్స్, ఫ్లాప్స్ అనేవి ఎవరి చేతిలో ఉండవు కాబట్టి.. వారు పడిన శ్రమను గుర్తించడం తప్ప మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి.