Akira Nandan: BRO మూవీ చూసిన అకీరా.. ష‌ర్ట్ వైర‌ల్

Hyderabad: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) కుమారుడు అకీరా నంద‌న్‌కు (akira nandan) ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇంత‌కుముందంటే చిన్నవాడు కాబ‌ట్టి ఎక్క‌డికి వెళ్లినా జ‌నాలు గుమిగూడేంత క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పెద్ద‌వాడు అయిపోయాడు. పైగా నాన్న‌కు మించిన హైట్. దాంతో అకీరా ప‌వ‌న్ లీగ‌సీని కంటిన్యూ చేస్తాడేమోన‌ని ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతున్నారు. అయితే.. ప‌వ‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) న‌టించిన బ్రో (bro) సినిమాను అకీరా త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి చూసాడు.

అయితే సినిమాకు వెళ్తున్న సంద‌ర్భంగా అకీరా.. బ్రో సినిమాలో ప‌వన్ వేసుకున్న ష‌ర్ట్ లాంటిది వేసుకున్నాడు. దానిపై ప‌వ‌న్ లుక్ ప్రింట్ చేసి ఉంది. దాంతో అకీరా థియేట‌ర్ నుంచి వ‌స్తుంటే ఫ్యాన్స్ ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. ఇక అకీరా (akira nandan) సినిమాల్లోకి వ‌స్తాడా అన్న విష‌యం గురించి మాట్లాడుకుంటే.. ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసాడు. కాక‌పోతే హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా. అకీరాకి హీరోగా ట్రై చేసే ఉద్దేశం అయితే అస్స‌లు లేద‌ని ఆల్రెడీ అకీరా త‌ల్లి రేణూ దేశాయ్ (renu desai) వెల్లడించేసారు.