Akira Nandan సినీ ఎంట్రీ.. రేణూ క్లారిటీ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) రేణూ దేశాయ్‌ల (renu desai) కుమారుడు అకీరా నంద‌న్ (akira nandan) సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వ‌స్తాడా అని ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాడు. అకీరాకు జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అనే ట్యాగ్ కూడా త‌గిలించేసారు. అయితే.. అకీరాకు సినిమాల్లోకి వ‌చ్చే ఇంట్రెస్ట్ అస్స‌లు లేదని ఆల్రెడీ ఒక‌సారి రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

అయితే నిన్న రేణూ దేశాయ్.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుతో (raghvendra rao) క‌లిసి ఒక ఫొటో దిగారు. ఆ ఫొటోను అకీరా తీసాడ‌ని చెప్ప‌డానికి అకీరాను ట్యాగ్ చేసారు. దాంతో రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో అకీరా సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌న్న ఊహాగానాలు మొద‌లైపోయాయి. సినిమా ఎప్పుడు వ‌దినా? ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు వ‌దినా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో మ‌రోసారి రేణూ క్లారిటీ ఇచ్చారు.

అకీరాకు (akira nandan) సినిమాల్లోకి రావాల‌ని కానీ హీరో అవ్వాల‌న్న ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడైతే లేద‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో ఏం నిర్ణ‌యం తీసుకుంటాడో ఇప్పుడే చెప్పలేన‌ని.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్ర‌తి ఫొటోను ప‌ట్టుకుని రూమ‌ర్స్ క్రియేట్ చేయొద్ద‌ని రిక్వెస్ట్ చేసారు. ఒక‌వేళ అకీరా సినిమాల్లోకి వ‌చ్చే మాటైతే.. తానే స్వ‌యంగా వెల్ల‌డిస్తాన‌ని క్లారిటీ ఇచ్చారు.