EXCLUSIVE: స‌లార్ 2లో అఖిల్..!

EXCLUSIVE: ప్ర‌భాస్‌కు (prabhas) చాలా కాలం త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని తెచ్చిపెట్టిన సినిమా స‌లార్ (salaar). ఇందుకు ప్ర‌శాంత్ నీల్‌కు (prashanth neel) ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టికీ రుణ ప‌డి ఉంటారు. అయితే స‌లార్ 2 (salaar 2) కూడా త్వ‌ర‌లో రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అక్కినేని అఖిల్ (akhil akkineni) కీ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇటీవ‌ల స‌లార్ స‌క్సెస్ పార్టీని గ్రాండ్‌గా ఏర్పాటుచేసారు. ఈ పార్టీలో అస‌లు సినిమాతో సంబంధం లేని అఖిల్ కూడా వ‌చ్చాడు. దాంతో దాదాపు గంట సేప‌టి వ‌ర‌కు ట్విట‌ర్‌లో అఖిల్ ట్రెండ్ అయ్యారు. ప్ర‌శాంత్ నీల్ అఖిల్‌ను పార్టీని స్పెష‌ల్‌గా ఆహ్వానించార‌ని స‌లార్ 2 లో అఖిల్‌కు కీల‌క రోల్ ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఒక్క హిట్ లేక ఇబ్బందిప‌డుతున్న అఖిల్‌కు స‌లార్ 2 ట్రాక్‌లోకి తెస్తుందేమో వేచి చూడాలి.