శోభితతో నాగచైతన్య రిలేషన్.. అఖిల్ రియాక్షన్ ఇదే
Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నటించిన తాజా చిత్రం ఏజెంట్(Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ మీట్లో అఖిల్ అక్కినేని తన సోదరుడు నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాల(Sobhita Dhulipala) రిలేషన్‌పై స్పందించారు.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోయిన్ శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) రిలేషన్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన ఓ పిక్ అది నిజమేనని రుజువు చేసింది. అయితే దీని పై ఇప్పటి వరకు చైతన్య, శోభిత ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరి గురించి అఖిల్‌ని మీడియా ముందు ప్రశ్నించారు.
ఏజెంట్ సినిమా ప్రెస్మీట్లో ‘మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించారు. మరి మీ పరిస్థితి ఏంటి?’ అని ఓ జర్నలిస్ట్ నేరుగా ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ.. ‘నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా పిలక, బాడీ మెయిన్‌టైన్ చేయడమే సరిపోయింది’ అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఏజెంట్ మూవీని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18న ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకం పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.