AK62: తలా బర్త్​డేకి అదిరిపోయే అప్​డేట్​!

Chennai: కోలీవుడ్​ స్టార్​ హీరో అజిత్(Ajith)​ ​ ప్రస్తుతం తన 62వ సినిమాలో నటిస్తున్నారు. ఏకే62(AK62) వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మేజిహ్ తిరుమెని(Magizh Thirumeni) డైరెక్ట్​ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న  టైటిల్​ ఇంకా ఖరారు కాలేదు. ఇక, మే 1న అజిత్​ బర్త్​డే సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్​డేట్​ రానుందని తెలుస్తోంది.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎలాంటి క్రేజీ న్యూస్ అందించబోతుందని సస్పెన్స్ నెలకొంది. ఏకే 62 చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్‌, అరుళ్‌నిధి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai Bachchan) ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో కనిపించనుంది. అజిత్‌, ఐశ్వర్యరాయ్‌ కాంబినేషన్‌లో 2000 సంవత్సరంలో ప్రియురాలు పిలిచింది సినిమా వచ్చింది. ఈ ఇద్దరు మళ్లీ 23 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్‌ యాక్టర్‌ అరవింద్‌ స్వామి కీ రోల్‌లో నటించనున్నట్టు సమాచారం.

నిజానికి ఈ సినిమాను విఘ్నేష్ శివన్(Vignesh Sivan) డైరెక్ట్‌ చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ ‘సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని నిర్మాత చెప్పారు. ఆ విషయంలో నిర్మాతతో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ స్క్రిప్ట్‌ పై పని చేయడానికి అజిత్ కు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. భవిష్యత్తులో కచ్చితంగా అజిత్ తో నా స్క్రిప్ట్ తో సినిమా తీస్తాను’ అంటూ తాను ఈ సినిమా నుంచి తప్పుకోడానికి కారణాలు చెప్పుకొచ్చాడు విఘ్నేష్.