Ajith Kumar: తలా బర్త్​డే స్పెషల్​!

Hyderabad: కోలీవుడ్​ స్టార్​ హీరో అజిత్​(Ajith kumar) అంటే తెలుగు వారికీ అభిమానమే. దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్​ పుట్టి పెరిగింది హైదరాబాద్​లోనే. కెరీర్​ తొలినాళ్లలో క్యూట్​ లుక్స్​లో లవర్​ బాయ్​గా అమ్మాయిల మనసు దోచేసిన అజిత్​ ఇప్పటికీ అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ప్రేమకథలు, యాక్షన్​ సినిమాల‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు అజిత్. దాదాపు 50 సినిమాల్లో హీరోగా చేశారు. అజిత్ న‌టించిన త‌మిళ్ సినిమాలు తెలుగులో చాలా వ‌ర‌కు డ‌బ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో అజిత్‌కు అంతటి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అజిత్ నటించిన ‘ప్రేమలేఖ’(Prema Lekha) సినిమా ఇప్పటికీ ఓ కల్ట్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం తన 62(AK62)వ సినిమాతో బిజీగా ఉన్నారు అజిత్​.

ద‌క్షిణాది చిత్రాల‌కు అందించే ప్రత్యేకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అజిత్ అందుకున్నారు. అలాగే సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు అజిత్‌ను మూడు సార్లు వ‌రించింది. అజిత్ నటుడిగా అందరికీ సుపరిచితమే కానీ ఫార్ములా 2 రేస‌ర్‌గా అజిత్ సాధించిన విజయాలు ఎవ‌రికీ అంతగా తెలియదు. జాతీయ, అంత‌ర్జాతీయ రేసింగ్ పోటీల్లో ప్రతీ సంవత్సరం అజిత్ పాల్గొంటారు. అంతే కాదు.. పైలెట్ లైసెన్స్ కూడా అజిత్ క‌లిగి ఉన్నారు. షూటింగ్ లేని టైంలో స్టూడెంట్స్‌కు అజిత్ శిక్ష‌ణ కూడా ఇస్తుంటారు.

ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలిని(Shalini)ని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు ఆద్విక్ కుమార్, పాప అనుష్క.
ప్రేమ‌లేఖ‌, ప్రియురాలు పిలిచింది లాంటి సినిమాల నుంచి.. ఈ మ‌ధ్యకాలంలో విడుదలైన విశ్వాసం, వివేకం, తెగింపు లాంటి చిత్రాల వరకు.. అజిత్ సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాకుండా రేసర్​గానూ, మంచి ఫ్యామిలీ మ్యాన్​గానూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న తలా అజిత్​కి న్యూస్​ఎక్స్​ తెలుగు తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.