Ajay Bhupathi: ప్ర‌భాస్‌ని అంత మాటంటావా? నిన్ను ఎవ్వ‌డూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కుళ్లు

ajay bhupathi slams arshad warsi for calling prabhas as joker

Ajay Bhupathi: బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సి.. రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ని ప‌ట్టుకుని జోక‌ర్ అని కామెంట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అత‌నిపై టాలీవుడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే అర్ష‌ద్ వార్సిని సోష‌ల్ మీడియాలో దుమ్ముదులిపేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఈ అంశంపై స్పందించారు. అర్ష‌ద్ వార్సి ఫేడౌట్ అయిపోయిన న‌టుడ‌ని.. క‌ల్కికి మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌న్న కుళ్లుతో ఆయ‌న ప్ర‌భాస్‌పై ప‌డి ఏడుస్తున్నాడ‌ని మండిప‌డ్డాడు. ఇంత‌వ‌ర‌కు ప్ర‌భాస్‌ని ప‌ట్టుకుని ఎవ్వ‌రూ కూడా అంత మాట అన‌లేద‌ని.. అత‌ని సినిమాలను అత‌న్ని ఎవ్వ‌డూ చూడ‌ట్లేద‌న్న కుళ్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.