‘ఐష్.. హెయిర్ స్టైలిస్ట్‌ని మార్చేయండి’
France: 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes 2023) బుధవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలుపోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు హాజరై ట్రెండీ దుస్తులు ధరించి అందరినీ ఆకర్షిస్తున్నారు.
ఇక స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక ఏటా ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ వైపే ఉంటాయి.
ఐశ్వర్య కూడా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ధరించి తళుక్కున మెరిసిపోతున్నారు. కానీ ఈ సంవత్సరం ఐశ్వర్య లుక్స్, కాస్ట్యూమ్స్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రతి కాస్ట్యూమ్ బాలేదని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఐష్ వేసుకున్న ప్లవర్ ఫ్రాక్, సిల్వర్ ఫ్రాక్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ‘నువ్వేమైనా నడిచే గార్డెన్వా’, ‘వెండి హుడీ ఏంటి విడ్డూరంగా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు హెయిర్ స్టైల్ కూడా బాలేదంటూ వెంటనే హెయిర్ స్టైలిస్ట్‌ని, డిజైనర్నీ మార్చేయమంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘మీ నుంచి కొత్త హెయిర్‌స్టైల్స్‌ను ఆశిస్తున్నా.. కానీ, మీరు మాత్రం సెంటర్ లైన్ హెయిర్ స్టైల్‌కు అతుక్కుపోయారు’, ‘హీల్స్, మేకప్ అంతా బాగుంది, కానీ హెయిర్ స్టైలే నచ్చడం లేదు.. మార్చండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.