Aishwarya Arjun: పెళ్లిపీట‌లెక్క‌నున్న అర్జున్ కూతురు

Hyderabad: యాక్ష‌న్ కింగ్ అర్జున్ (arjun) కూతురు ఐశ్వ‌ర్య స‌ర్జా (aishwarya arjun) పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. ప్ర‌ముఖ న‌టుడు తంబి రామ‌య్య (thambi ramaiah) కుమారుడు ఉమాప‌తితో (umapathy) ఐశ్వ‌ర్య వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు క‌న్న‌డ వ‌ర్గాల స‌మాచారం. కొంత‌కాలంగా ఐశ్వ‌ర్య‌, ఉమాప‌తి ప్రేమ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో 2024 ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. ప‌ట్టాత్తు యానై అనే త‌మిళ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఐశ్వ‌ర్య‌. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించారు. తెలుగులోనూ ఆమె నుంచి ఓ సినిమా రాబోతోంది.