ఐశ్వ‌ర్య ధ‌నుష్‌లు వేరొక‌రితో ఎఫైర్ పెట్టుకున్నారు.. గాయ‌ని షాకింగ్ కామెంట్స్

Aishwarya and Dhanush have cheated on each other says singer suchitra

Aishwarya Dhanush: ప్ర‌ముఖ త‌మిళ గాయ‌ని సుచిత్ర ఐశ్వ‌ర్య ధ‌నుష్‌ల‌పై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కూతురు అయిన ఐశ్వ‌ర్య‌.. త‌న భ‌ర్త ధ‌నుష్‌తో 18 ఏళ్లు కాపురం చేసాక విడిపోయారు. ఇటీవ‌ల చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టు వీరిద్ద‌రికీ అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.

అయితే వీరిద్ద‌రూ విడిపోవ‌డానికి కారణం ఇద్ద‌రూ వేరొక‌రితో ఎఫైర్ పెట్టుకోవ‌డ‌మే అని గాయ‌ని సుచిత్ర ఓ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసారు. “” ధ‌నుష్ మోసం చేసాడు అని ఎన్నో సార్లు ఐశ్వ‌ర్య ఆరోప‌ణ‌లు చేసింది. కానీ ఇన్నేళ్లూ ఐశ్వ‌ర్య చేసింది కూడా అదే. వీరిద్ద‌రికీ వేరొక‌రితో ఎఫైర్లు ఉన్నాయి. త‌మ కొత్త ల‌వ‌ర్స్‌తో క‌లిసి బార్‌లో క‌లిసి డ్రింక్స్ తాగేవారు. ఐశ్వ‌ర్య మంచి త‌ల్లి కాదు. ధ‌నుష్ త‌న ఇద్దరు బిడ్డ‌ల్ని చాలా బాగా చూసుకునేవాడు. పెళ్ల‌య్యాక వేరొక‌రితో ఎఫైర్లు పెట్టుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ “” అని సుచిత్ర వెల్ల‌డించారు.