Trisha: “మాజీ సీఎం త్రిషకు డబ్బిచ్చి ఆమెతో…”
Trisha: ఎవర్గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్‌పై ఈ మధ్యకాలంలో చాలా మంది అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) త్రిష గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలయ్యారు. ఇప్పుడు AIADMK నేత ఏవీ రాజు (AV Raju) త్రిష గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. 2017 శశికళ తన పార్టీలోని నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వకుండా కూవత్తూర్‌లోని ఓ రిసార్ట్‌లో బలవంతంగా బంధించిందన్న విషయం గురించి ప్రస్తావిస్తూ మధ్యలో త్రిష గురించి కామెంట్ చేసారు.
ఆ సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswamy) త్రిషను రిసార్ట్‌కి రప్పించుకుని ఆమెతో సన్నిహితంగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇందుకోసం ఆమెకు రూ.25 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. కరుణాస్ (Karunas) అనే నటుడు పళనిస్వామి కోసం ఈ ఏర్పాటు చేసారని అన్నారు. ఏవీ రాజు ఇంతటితో ఆగలేదు. పళనిస్వామికి తాగే అలవాటు లేదని కానీ కేవలం త్రిషను మాత్రమే కావాలనుకున్నారని అన్నారు. కరుణాస్ అనే నటుడు ప్రతి నటి వద్దకు వెళ్లి వారికి డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరికైనా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాడని.. ఇండస్ట్రీలో ఇలాంటి పనులు కరుణాస్ మాత్రమే చూసుకుంటాడని తెలిపారు. (Trisha)
ఇన్ని ఆరోపణలు బహిరంగంగా చేస్తున్నారు కదా మరి ఏమైనా ప్రూఫ్‌లు ఉన్నాయా అని అడగ్గా.. ఏ నటి ఎవరి వద్దకు వెళ్తోంది? ఎవరితో ఉంటోంది? వంటి పర్సనల్ అంశాలకు సంబంధించి సాక్ష్యాలను ఎవరైనా పెట్టుకుంటారా అంటూ వెకిలి నవ్వులు నవ్వాడు. అయితే దీనిపై త్రిష కూడా స్పందించారు. అటెన్షన్ కోసం ఇంతగా దిగజారుతారని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు. కొందరు మనుషులు అటెన్షన్ కోసం ఇంతగా దిగజారిపోవడాన్ని చూస్తుంటే అసహ్యమేస్తోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఇక దీని గురించి రావాల్సిన ప్రతి సమాచారం నా లీగల్ టీం నుంచే వస్తుంది అని త్రిష ట్వీట్ చేసారు.
మన్సూర్ అలీ ఖాన్ వివాదం
ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా ఇలాగే త్రిషపై అసభ్యకర కామెంట్స్ చేసారు. తాను ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించానని.. చాలా మంది హీరోయిన్లతో రేప్ సీన్లు కూడా చేసానని అన్నారు. అయితే త్రిషతో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా అలాంటి సన్నివేశంలో నటించే అవకాశం రాలేదని.. ఆ అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని అన్నాడు. దాంతో ఈ అంశం కాస్తా యావత్ తమిళ ఇండస్ట్రీలో దుమారం రేపింది. దీనిపై త్రిష స్పందిస్తూ.. ఇలాంటి వాడితో ఇప్పటివరకు నటించే అవకాశం రానందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఇక ముందు కూడా మన్సూర్‌తో నటించే అవకాశం రాకూండా చూడాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తానని మండిపడ్డారు.
తమిళ సెలబ్రిటీలతో పాటు చిరంజీవి, నితిన్ వంటి టాలీవుడ్ హీరోలు కూడా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారిని ఊరికే వదిలిపెట్టకూడదని అన్నారు. ఆ తర్వాత త్రిష మన్సూర్‌పై కేసు వేసారు. మన్సూర్ మాత్రం సారీ చెప్పను అని మొండికేసారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బుద్ధి వచ్చి మన్సూర్ మీడియా సమక్షంలో త్రిషకు సారీ చెప్పారు. త్రిష కూడా క్షమించి వదిలేసారు. అయితే మన్సూర్ ఈ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా త్రిషపై.. ఆమెకు మద్దతు ఇచ్చిన చిరంజీవిపై కూడా పరువు నష్టం దావా వేసారు. ఈ పరువు నష్టం దావాను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి మన్సూర్‌పై మండిపడ్డాడు. కేసు వేయాల్సింది త్రిష కదా మీరెలా వేస్తారు అని మందలించి పంపించారు.