Agent: అఖిల్​ సినిమా… ఫ్యాన్స్​కి సర్​ప్రైజ్!

Hyderanad:  టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil), డైరెక్టర్​ సురెందర్​ రెడ్డి కలయికలో వస్తున్న సినిమా ఏజెంట్(Agent). ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఓ ముఖ్య పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్​గా టాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనుంది. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది. అభిమానులను సర్​ప్రైజ్​ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏజెంట్‌లో రామ్ చరణ్‌(Ramcharan) గెస్ట్ రోల్‌ ప్లే చేస్తున్నట్టు హింట్ ఇచ్చేలా.. సాలిడ్ వీడియో రిలీజ్ చేశారు. Stay tuned…. #Dhruva x #Agent అంటూ వీడియోని వదిలారు. ఇందులో ఏజెంట్‌ని.. ధృవ మీట్ అవబోతున్నట్లు చూపించారు. బ్యాక్ సైడ్‌ నుంచి రాంచరణ్ ని చూపిస్తూ.. ఏజెంట్ ఎక్కడున్నావు? అంటూ రాంచరణ్ పవర్ ఫుల్ వాయిస్ రివీల్ చేశారు. దీనికి పరిస్థితులు మరింత వైల్డ్‌గా  మారుతున్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే అసలు విషయం మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ఖచ్చితంగా చరణ్‌(Ramcharan) తో ఏజెంట్ ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే చరణ్, అఖిల్‌(Akhil) ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. థియేటర్ బాక్సులు బద్దలవడం ఖాయం. గతంలో చరణ్‌తో ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘ధృవ’ సినిమా తీశాడు. ఆ తర్వాత చరణ్, చిరంజీవి హీరోగా ప్రొడ్యూస్ చేసిన సైరానరసింహారెడ్డికి దర్శకత్వం వహించాడు. చరణ్‌తో సురేందర్ రెడ్డి మంచి బాండింగ్ ఉంది. దీంతో సురేందర్ రెడ్డి ఏజెంట్‌ను స్పై యూనివర్స్‌గా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా చరణ్ ఏజెంట్​లో కనిపిస్తే అటు మెగా ఫ్యాన్స్​, ఇటు అక్కినేని ఫ్యాన్స్​కి పండగే!