Agent: సెన్సార్​ రివ్యూ ఏంటో తెలుసా?

Hyderabad: అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నటిస్తున్న స్పై థ్రిల్లర్‌‌ సినిమా ఏజెంట్ (Agent). భారీ బడ్జెట్‌తో దాదాపు రెండేళ్లకుపైగా షూటింగ్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌, పాటలు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
‘వైల్డ్ సాలా’గా అఖిల్ చేసే యాక్షన్స్ సన్నివేశాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ ను పరుగులు పెట్టిస్తున్నాడు అఖిల్. ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ నిజంగానే ప్రమోషన్స్‌ లో వైల్డ్‌లా బిహేవ్ చేస్తున్నాడు. అగ్రెసివ్ గా డూ ఆర్ డై అన్నట్టు ఏజెంట్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

ఏజెంట్ ప్రీ బుకింగ్స్‌ కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. అందుకు తగినట్టుగానే ఏజెంట్‌ సినిమాకు వచ్చి సెన్సార్ టాక్‌ కూడా సినిమాపై బజ్ పెంచేస్తోంది. సెన్సార్ బోర్డ్‌ ఏజెంట్‌ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారట. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. ఒక పర్ఫెక్ట్‌ కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్ రన్ టైం అంటున్నారు అక్కినేని అభిమానులు. దీంతో థియేటర్లో బుల్లెట్ల వర్షం పక్క అంటున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఏజెంట్‌లో సినిమాలో మమ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషించారు. సురేందర్ రెడ్డి (Surendar Reddy) దర్శకత్వం వహించిన ఏజెంట్‌ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోంది.