Agent: బ్రేకప్​ పాటతో అలరిస్తున్న అఖిల్​!

Hyderabad: అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏజెంట్(Agent).స్పై థ్రిల్లర్‌ రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.కె. ఎంటర్ టైన్​మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా రామా కృష్ణా అంటూ సాగే ఓ బ్రేకప్​ సాంగ్ రిలీజ్ చేశారు.

బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేకప్ సాంగ్​గా ఈ పాట అలరిస్తోంది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా ఉంది పాట. ఈ పాటకు చంద్రబోస్ (Chandra Bose) సాహిత్యం అందించగా.. హిప్ హాప్ తమిళ  సంగీతం అందించారు. పాపులర్​ సింగర్​ రామ్ మిర్యాల (Ram Miriyala)పాడారు. అఖిల్ ఒక సాధువులా కాషాయ దుస్తులు ధరించి కనిపించడం డిఫరెంట్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏజెంట్​ (Agent) చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయిన అఖిల్.. స్టైలిష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్​ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమాతో మంచి హిట్​ అందుకున్న అఖిల్​కు ఈ సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు అక్కినేని అభిమానులు.