NBK 108: ఇక జై బాల‌య్య కాదు.. ల‌వ్యూ బాల‌య్య ట్రెండ్!

Hyderabad: జై బాల‌య్య(nbk 108) అనే ట్రెండ్ న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కి ఓ ఎమోష‌న్ లాంటిది. స‌మ‌యం, సంద‌ర్భం ఏదైనా జై బాల‌య్య అనే స్లోగ‌న్ ఎంతో వైర‌ల్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో గోవింద గోవింద అనే ప‌దాల‌కు ఎంత పాపులారిటీ ఉందో జై బాల‌య్య అనే ట్రెండ్ కూడా అంతే పాపులారిటీ ఉంద‌ని త‌మ‌న్ కూడా ఒక‌సారి అన్నారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మార‌బోతోంది. అనిల్​ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK108 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచీ రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక‌. జై బాల‌య్య అని కాకుండా ల‌వ్యూ బాల‌య్య అని అంటార‌ని ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ అంటున్నారు. NBK108లో బ్ర‌హ్మాజీ కూడా ఉన్నారు. ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌రైజేష‌న్ నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్లు ఉంటుంద‌ని, క్లాసీ, మాసీ ఎలిమెంట్స్ ఉంటాయ‌ని హైప్ పెంచేసారు బ్ర‌హ్మాజీ. ఇక ఈ సినిమాను అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.