Aditi Rao Hydari: సౌత్​ వర్సెస్​ బాలీవుడ్​ అర్థం లేని చర్చ!

Hyderabad: కొన్నాళ్ళుగా సౌత్ (South) వర్సెస్ బాలీవుడ్ (Bollywood) అని చర్చలు సాగుతూనే ఉన్నాయి. సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధిస్తుండడంతో ఈ చర్చలు మరింతగా పెరుగుతున్నాయి. కొంతమంది వీటిని పాజిటివ్ గా తీసుకుంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే చర్చపై ఎవరి కామెంట్స్ వారు చేస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) స్పందించింది. బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది అదితి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అదితిని సౌత్ వర్సెస్ హిందీ సినిమాల గురించి ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

హిందీ వర్సెస్ సౌత్ సినిమా అని చర్చించుకోవడంలో అర్ధం లేదు. నా మనసులో అయితే అలాంటి డిఫరెన్సెస్‌ ఏం లేవు. నేను అన్ని చోట్ల సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తున్నాము. సినిమాను ఏ భాషలో చేసినా దాని అంతిమ లక్ష్యం ప్రేక్షకులకు వినోదాన్ని అందరించడమే. మన దేశంలో రకరకాల సంస్కృతులు, భాషలు, ప్రతిభలు ఉన్నాయి. వాటిని చూసి మురిసిపోవాలి. వాటిని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాలి. అంతే కానీ ఇలా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే చర్చలు అనవసరం. సౌత్ కూడా ఒక్కటే కాదు, సౌత్ లో నాలుగు సినీ పరిశ్రమలు ఉన్నాయి అని గుర్తుచేసింది ఈ భామ.