Aditi Arya: ఉద‌య్ కోట‌క్ కోడ‌లు కాబోతున్న‌ క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్..!

Hyderabad: క‌ళ్యాణ్ రామ్‌తో (kalyan ram) క‌లిసి ఇజం సినిమాలో న‌టించిన అదితి ఆర్య (aditi arya) పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. వ‌రుడు ఎవ‌రో కాదు.. బ్యాంకింగ్ బిలియ‌నేర్, కోట‌క్ మ‌హీంద్రా సీఈఓ (kotak mahindra) ఉద‌య్ కోట‌క్ (uday kotak) కుమారుడు జై కోట‌క్ (jay kotak). ఈ విషయాన్ని జై కోట‌క్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. అదితి ఆర్య 2015లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు వ‌రుస‌క‌ట్టాయి. అలా క‌ళ్యాణ్ రామ్‌కి జోడీగా ఇజం సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత నిన్ను వ‌దిలి నేను పోలేనులే, సెవెన్ సినిమాల‌తో పాటు త‌మిళం, హిందీ సినిమాల్లోనూ న‌టించారు. ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి అక్కడ యేల్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు. ఈ విషయాన్ని జై కోట‌క్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ.. నాకు కాబోయే భార్య ఎంబీఏ ప‌ట్టా అందుకుంది అంటూ ట్వీట్ చేసారు.