Adipurush: హనుమంతుడు అసలు దేవుడే కాదట!
Hyderabad: ఇది మన బాలీవుడ్ సినిమా కాదు కదా.. తెలుగు హీరో నటిస్తున్న సినిమా. ఈ మాత్రం దానికి శ్రద్ధ పెట్టి డైలాగులు రాయడం ఎందుకు? అయినా టాలీవుడ్ వాళ్లకి నేను డైలాగులు ఎందుకు రాయాలి? బాగా డబ్బు వస్తుంది. ఏదో ఒకటి రాసేద్దాం. ఒకవేళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ల నోళ్లు మూయిద్దాం. ఆదిపురుష్ (adipurush) సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ (manoj muntashir) సరిగ్గా ఇలాగే ఆలోచించి ఉంటారని ఆయన మీడియా ముందు చేస్తున్న కామెంట్స్‌ని బట్టి అర్థమైపోతోంది. సినిమాలో ఉన్నది ప్రభాస్ (prabhas) కాబట్టి కలెక్షన్లకు ఏ లోటూ లేదు.
కానీ రామాయణం అని చెప్పి ఏదో తూతూ మంత్రంగా సినిమా తీసారేంటి అని ఫ్యాన్స్, ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్నలకు డైరెక్టర్ ఓం రౌత్ (om raut), రైటర్ మనోజ్ ముంతాషిర్ చెప్తున్న సమాధానాలు వింటే ఒళ్లు మండిపోతోంది. రామాయణం అని చెప్పి ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్లు, చెత్త డైలాగులు ఎలా పెడతారు అని అడిగితే.. ఇది రామాయణం అని ఎవరు చెప్పారు? ఇది రామాయణం కాదు. రామాయణంలోని రావణకాండ అనే ఎపిసోడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తీసిన సినిమా అని చెప్పారు. మరి హనుమంతుడి డైలాగులు అంత చీప్‌గా ఉన్నాయేంటి అని అడిగితే… హనుమంతుడు అసలు దేవుడే కాదు అని అంటున్నాడు మనోజ్. ఇప్పటికైనా రామాయణాన్ని అసహాస్యం చేస్తూ ఆదిపురుష్ తీసామని క్షమాపణలు చెప్పి టీం అంతా సైలెంట్‌గా ఉంటే బాగుంటుంది. లేదంటే హిందూ సంఘాలు చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. ఇప్పటికే మనోజ్ ముంతాషిర్ ముంబైలో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించుకున్నాడు.