Adipurush: అస్స‌లు బాలేద‌ట‌.. పెద్దాయ‌న రివ్యూ ఇచ్చేసారు!

Hyderabad: ప్ర‌భాస్ )prabhas) న‌టించిన ఆదిపురుష్‌పై (adipurush) మిక్స్‌డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల టాక్‌ను బ‌ట్టి చూస్తే.. కేవ‌లం ప్ర‌భాస్ ఫ్యాన్స్ బాగుంద‌ని అంటున్న‌ట్లు అనిపిస్తోంది. ప్ర‌భాస్ లాంటి హీరోని రాముడిగా పెట్టుకుని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ (om raut) స్క్రిప్ట్ స‌రిగ్గా ఉప‌యోగించుకోలేద‌ని అంటున్నారు. ఇక సినిమాకు అతిపెద్ద మైన‌స్ VFX. ఇంకా VFXవ‌ర్క్ కాకుండానే రిలీజ్ చేసేసారేమో అనిపించేలా కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయి. ఇక‌పోతే.. ప్ర‌ముఖ ఫిలిం క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ (taran adarsh) సినిమాపై త‌న రివ్యూ చెప్పేసారు. సినిమా తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని అన్నారు. గొప్ప న‌టులు, భారీ బ‌డ్జెట్ ఉండి కూడా సినిమాను పాడుచేసాడు అంటూ ఓం రౌత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.