Adipurush Pre Release Event: డై హార్డ్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌!

Tirupati: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టించిన ఆదిపురుష్ (adipurush pre release event) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ట‌హాసంగా మొదలైంది. తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ ప్లాన్ చేసారు. దాదాపు ల‌క్ష మందికి పైగా ఫ్యాన్స్‌తో స్టేడియం మారుమోగిపోతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదేన‌ని అంటున్నారు. ఈవెంట్‌కు చిన‌జీయ‌ర్ స్వామి అతిథిగా విచ్చేసారు. రాత్రి 9 గంట‌ల‌కు అద్భుత‌మైన ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. 16న సినిమా ప్యాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో అన్ని భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.