Adipurush: ‘జై శ్రీరామ్‌’తో మారుమోగుతున్న యూట్యూబ్

Hyderabad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న క్రేజీ సినిమా ఆదిపురుష్ (Adipurush). రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్ర పోషించిన ఆదిపురుష్ సినిమా నుంచి మరో అప్‌డేట్ విడుదల చేశారు మేకర్స్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమాపై నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేసిన నాటి నుంచి ప్రతి దానిపైనా విమర్శలు వెల్లవెత్తుతూనే ఉన్నాయి. గ్రాఫిక్స్ బాగా లేవని ఇన్నాళ్ల నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వకుండా చేసింది ఇదేనా అని కూడా పలువరు విమర్శించారు. ఇక, టీజర్ విడుదల తర్వాత అయితే సోషల్ మీడియాలో దర్శకుడిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక, శ్రీరామనవమి రోజుఇచ్చిన స్పెషల్ పోస్టర్ పైనా పలు కామెంట్లు వచ్చాయి.

ఆదిపురుష్ నుండి వస్తున్న ప్రతి అప్డేట్ నిరాశపరిచినప్పటికీ ఈసారి మాత్రం దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులను మెప్పించారనే చెప్పాలి. వన్ మినిట్ లిరికల్ వీడియో విడుదల చేసి అలరించారు. రాముని ఉద్దేశిస్తూ ఆయన సైన్యం పాడిన ‘జై శ్రీరామ్’ పాట ఆకట్టుకునేలా ఉంది. విల్లు ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్న రాముడిగా ప్రభాస్ కటౌట్ ఆకట్టుకుంటోంది. ఆదిపురుష్ లిరికల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఆదిపురుష్‌ (Adipurush) సినిమా.