Adah Sharma: నేను సెట్‌కి వ‌చ్చాక హీరోని పిలుస్తారు

Hyderabad: తాను సెట్స్‌కి వ‌చ్చాకే హీరోని పిలుస్తార‌ని అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేస్తూ ఉండేదాన్నంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు న‌టి అదా శ‌ర్మ‌ (adah sharma). ఆమె కీ రోల్‌లో న‌టించిన ది కేర‌ళ స్టోరీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

“నేను నార్త్, సౌత్ హీరోల‌తో క‌లిసి న‌టించా. మంచి చూసాను చెడు చూసాను. నాకు ఒక విష‌యం చాలా క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. డైరెక్ట‌ర్ మంచివాడైతే అంతా బాగానే ఉంటుంది. అదే డైరెక్ట‌ర్ విచ‌క్ష‌ణ లేనివాడైతే షూటింగ్ అయ్యేవ‌ర‌కు లేనిపోని త‌ల‌నొప్పి. షూటింగ్ స‌మ‌యంలో నేను సెట్స్‌కి వ‌చ్చాక ఆ హీరోయిన్ వ‌చ్చేసింది ఇక హీరోని పిలుద్దాం అని అప్పటిక‌ప్పుడు హీరో మేనేజ‌ర్‌కి ఫోన్ చేసి సెట్స్‌కి రండి స‌ర్ హీరోయిన్ వ‌చ్చింది అని చెప్పేవాళ్లు. నాకు చాలా బాధేసేది. ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాలి? హీరో హీరోయిన్లు ఒకేసారి సెట్స్‌కి రావాల‌న్న నియ‌మం ఎందుకు లేదు?” అని ప్ర‌శ్నించారు. అదా తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఎన్నో సినిమాల్లో న‌టించారు. అయితే ఆమెను సెట్స్‌లో హీరో కోసం వెయిట్ చేయించేవారు అని ఎవ‌రి గురించి చెప్పారా అన్న విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.