Adah Sharma ఫోన్ నెంబ‌ర్ లీక్ చేసిన వ్య‌క్తి

Hyderabad: న‌టి అదా శ‌ర్మ ఫోన్ (adah sharma) నెంబ‌ర్ లీకైంది. ఆమె న‌టించిన ది కేర‌ళ స్టోరీ (the kerala story) సినిమాను వ్య‌తిరేకించిన ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ఇదే అదా శ‌ర్మ ఫోన్ నెంబ‌ర్.. కొత్త నెంబ‌ర్ కూడా త్వ‌ర‌లో లీక్ చేస్తా అని పోస్ట్ చేయ‌డంతో ఇత‌ర యూజ‌ర్లు వెంట‌నే రిపోర్ట్ కొట్టారు. విష‌యాన్ని అదా శ‌ర్మ వ‌ర‌కు తీసుకెళ్ల‌డంతో ఆమె సైబ‌ర్ అధికారుల‌కు ఫిర్యాదు చేసారు. ది కేర‌ళ స్టోరీ (the kerala story) ఎంతో వివాదాస్ప‌ద‌మైన‌ప్ప‌టికీ రూ.100 కోట్లు దాటేసింది. బెంగాలీ డైరెక్ట‌ర్ సుదీప్తో సేన్ ది కేర‌ళ స్టోరీని డైరెక్ట్ చేసారు. ల‌వ్ జిహాదీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ఎంతో వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టికే వెస్ట్ బెంగాల్‌లో ఈ సినిమాను బ్యాన్ చేసారు. BJP అధికార రాష్ట్రాల్లో మాత్ర‌మే ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌ల ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో చూపించిన‌దంతా అబ‌ద్ధ‌మేనంటూ చాలా మంది సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లారు కానీ సినిమాను బ్యాన్ చేయించ‌లేక‌పోయారు.