దేవుడా.. పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ పోస్ట‌ర్!

Hyderabad: RX 100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్(payal rajput) మ‌రో ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతోంది. RX 100తో త‌న స‌త్తాచాటిన అజ‌య్ భూప‌తి(ajay bhupathi) డైరెక్ట్ చేస్తున్న సినిమాలో పాయ‌ల్ క‌నిపించ‌బోతోంది. సినిమాకు మంగ‌ళ‌వారం అనే టైటిల్ పెట్టారు. ఇందులో పాయ‌ల్ శైల‌జ అనే క్యారెక్టర్‌లో క‌నిపించ‌బోతోంది. ఈరోజు మంగ‌ళ‌వారం కావ‌డంతో పాయ‌ల్ త‌న పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. పోస్ట‌ర్‌లో పాయ‌ల్ హాఫ్ న్యూడ్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌లోనూ రిలీజ్ చేయ‌నున్నారు. చూడ‌బోతే ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో పాయ‌ల్ వ్యాంప్ క్యారెక్ట‌ర్లో క‌నిపించ‌బోతున్నార‌ని పోస్ట‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఆర్ ఎక్స్ 100 విజ‌యంతో పాయ‌ల్ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది.