Hema: నన్ను బద్నాం చేస్తున్నారు.. అందరి సంగతి తేలుస్తా
Hema: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ హేమ మాత్రం తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. అసలు బెంగళూరు వెళ్లలేదని స్పష్టం చేసారు. తనను కావాలనే బద్నాం చేస్తున్నారని.. ఒక రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. రేవ్ పార్టీ విషయం బయటపడినప్పటి నుంచి దాదాపు 250 మంది జర్నలిస్ట్‌లతో ఫోన్‌లో మాట్లాడానని.. తాను పోలీసుల అదుపులో ఉండి ఉంటే ఫోన్ కాల్స్ ఎలా లిఫ్ట్ చేస్తానని ప్రశ్నించారు.
అసలేం జరిగింది?
రెండు రోజుల క్రితం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు కావడంతో సెలబ్రిటీలను పిలిచి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఎంట్రీ టికెట్ ఏకంగా రూ.50 లక్షలట. ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్, నటి హేమతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే శ్రీకాంత్, హేమ, కాకాణి క్లారిటీ ఇస్తూ తాము అసలు ఆ పార్టీలో లేమని క్లారిటీ ఇచ్చారు. కానీ బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో హేమ ఉన్నట్లు తమకు క్లారిటీ వచ్చిందని తెలిపారు.