Siddharth: రేవంత్ రెడ్డిపై సిద్ధార్థ్ సెటైర్
Siddharth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నటుడు సిద్ధార్థ్ సెటైర్ వేసారు. భారతీయుడు 2 రిలీజ్ అవనున్న సందర్భంగా ప్రధాన నటీనటులంతా మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ టికెట్ రేట్ల గురించి ప్రస్తావించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాకు ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదని అన్నారు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంచడంపై రేవంత్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలు ఇస్తే అప్పుడు తప్పకుండా టికెట్ రేట్లను పెంచుతాం అని రేవంత్ అన్నారు. దీనిపై సిద్ధార్థ్ మండిపడ్డారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి అలా అనలేదని.. ప్రతి నటుడికి బాధ్యత ఉండాలని అన్నారు.
“” నాపేరు సిద్ధార్థ్ సర్. నేను 20 ఏళ్లుగా తెలుగు సినిమా ప్రేక్షకులకు కనిపిస్తున్నాను. రాష్ట్రం విభజన కావడానికి ముందు నేను ప్రభుత్వం తరఫున సురక్షితమైన సెక్స్ పేరుతో కండోమ్ యాడ్ చేసాను. దాదాపు ఐదేళ్ల పాటు నా ఫోటో బిల్‌బోర్డులపై కండోమ్ పట్టుకుని కనిపించింది. సామాజిక అవగాహన విషయంలో ప్రభుత్వం మమ్మల్ని ఏదన్నా చేయమంటే మేం చేస్తాం. నటులకు ప్రభుత్వం చెప్తేనే చేయాలని ఉండదు. ఆ బాధ్యత మాలో ముందు నుంచీ ఉంటుంది. అంతేకానీ ఏ ముఖ్యమంత్రి కూడా మీరు అది చేస్తేనే మేం ఇది చేస్తాం అని చెప్పలేదు. దీనికి నేను సమాధానం ఇచ్చేసాను కాబట్టి కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు “” అని కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు.