Ravi Kishan: నాన్న చంపాల‌ని చూసారు.. రేసు గుర్రం విల‌న్ షాకింగ్ కామెంట్స్

Ravi Kishan: ప్ర‌ముఖ న‌టుడు ర‌వి కిష‌న్ త‌న తండ్రి గురించి షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. లాప‌తా లేడీస్ అనే హిందీ సినిమాలో న‌టించిన ర‌వి కిష‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తాను ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.

“” మా నాన్న పూజారి. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు నాట‌కాలు వేయ‌డం అంటే ఇష్టం. కానీ నాన్న‌కు ఇవ‌న్నీ ఇష్టం లేవు. నేను పొలం ప‌నులు చేసుకోవ‌డం కానీ లేదా ఏద‌న్నా ప్ర‌భుత్వ ఉద్యోగం చేయాల‌నేది నాన్న కోరిక‌. ఏమీ లేక‌పోతే పూజారిగానే సెటిల్ అవ్వాల‌ని అనేవారు. కానీ నాకు అవేమీ ఇష్టం లేదు. నాకు 17 ఏళ్ల వ‌య‌సులో ఉన్న రామ్ లీలా నాట‌కంలో న‌టించాను. ఆ విష‌యం నాన్న‌కు తెలిసి న‌న్ను చావ‌బాదారు. న‌న్ను చంపేయ‌బోయారు. న‌న్ను చంపేసే ధైర్యం నాన్న‌కు ఉంద‌ని అమ్మ‌కు తెలుసు. అందుకే నా చేతిలో రూ.500 పెట్టి న‌న్ను ఇంట్లో నుంచి పారిపోమ‌ని చెప్పింది. అలా బ‌య‌టికి వ‌చ్చేసాను. అలా మా నాన్న కొట్టిన ప్ర‌తి దెబ్బ నాకు ఒక గుణ‌పాఠం లాంటిది. ఆ దెబ్బ‌లే ఈరోజు న‌న్ను ర‌వి కిష‌న్‌ను చేసాయి “” అని తెలిపారు.

అల్లు అర్జున్ న‌టించిన రేసు గుర్రం సినిమాలో ర‌వి కిష‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించారు. ఈ ఒక్క పాత్ర‌తో ఆయ‌న‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.