Priya: గ‌ర్భంతో ఉన్న మ‌ల‌యాళీ న‌టి.. గుండెపోటుతో మృతి

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. న‌టి ప్రియ (35) (priya) గుండెపోటుతో చ‌నిపోయారు. ఆమె ప్ర‌స్తుతానికి గ‌ర్భిణిగా ఉన్నారు. ప్రియ ఒక డాక్ట‌ర్ కూడా. అయితే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన త‌ర్వాత చ‌నిపోయారు. నెల‌లు నిండ‌కుండానే బిడ్డ పుట్టేసింది. దాంతో ప్ర‌స్తుతానికి ప్రియ‌కు పుట్టిన బిడ్డ‌ను ఐసీయూలో ఉంచారు. మొన్న మ‌ల‌యాళ న‌టి రెంజూషా మేన‌న్ (renjusha menon) ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయారు. రెండు రోజుల్లోనే మ‌రో న‌టి గుండెపోటుతో చ‌నిపోవ‌డంతో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.